‘క్రాక్’ 2 డేస్ కలెక్షన్స్..!

‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి వరుస డిజాస్టర్ లతో డీలా పడిపోయిన రవితేజ.. ఈసారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని ‘క్రాక్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ.. ఆర్ధిక సమస్యల కారణంగా కాస్త ఆలస్యంగా విడుదల అయ్యింది. దీంతో రవితేజ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినిమా అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. అయితే సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన `క్రాక్` చిత్రంతో వీరు హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశారు.

ఇక ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.31 cr
సీడెడ్  1.6 cr
ఉత్తరాంధ్ర  1.20 cr
ఈస్ట్  0.85 cr
వెస్ట్  0.75 cr
కృష్ణా  0.65 cr
గుంటూరు 0.89 cr
నెల్లూరు 0.43 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 9.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.40 cr
ఓవర్సీస్ 0.52 cr
టోటల్ వరల్డ్ వైడ్ : 10.61 cr

‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 10.61 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మరో 8 కోట్ల వరకూ షేర్ ను రాబడితే.. ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచినట్టే..! ఇంకా సంక్రాంతి సెలవులు మిగిలే ఉన్నాయి కాబట్టి.. ఆ టార్గెట్ చాలా ఈజీ అనే చెప్పాలి..!

Click Here To Read Movie Review

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.