పూజా హెగ్డేను కొరటాల శివ క్షమిస్తారా..?

ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు కొరటాల శివ. మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దర్శకునిగా కొరటాల శివకు మంచిపేరు తెచ్చిపెట్టింది. మిర్చి సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా పట్టాలెక్కింది.

మొదట ఆచార్య సినిమాలో చిరంజీవి మాత్రమే హీరోగా నటిస్తున్నట్టు ప్రకటన వెలువడగా ఆ తరువాత సినిమాలోని కీలక పాత్ర కోసం కొరటాల శివ రామ్ చరణ్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే కాజల్ ను అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్ పూజా హెగ్డేకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే పూజా హెగ్డే ఆచార్య షూటింగ్ పూర్తి చేశానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందమైన ఆంధ్రప్రదేశ్ లో ఆచార్య షూటింగ్ ను పూర్తి చేశానంటూ పూజా హెగ్డే తన పోస్ట్ ద్వారా చెప్పారు. ఇలా సినిమాకు సంబంధించిన కీలక విషయాన్ని పూజా హెగ్డే రివీల్ చేశారు. పూజా హెగ్డే ఇలా చేయడంతో కొరటాల శివ ఆమెపై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే నటిస్తున్నట్టు రాబోయే రోజుల్లో అప్ డేట్ ఇద్దామని కొరటాల శివ భావిస్తే పూజా హెగ్డే మాత్రం దర్శకునికి రివర్స్ లో షాక్ ఇచ్చారు.

కొన్ని నెలల క్రితం చిరంజీవి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఆచార్య సినిమా టైటిల్ ను లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు తన ప్రమేయం లేకుండానే లీక్ అవుతూ ఉండటంతో కొరటాల శివ తల పట్టుకుంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.