చిరు చరణ్ రోల్స్ పై క్లారిటీ ఇచ్చిన కొరటాల శివ

చిరంజీవి ఆచార్య సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో తెలియదు కానీ.. సినిమా షూటింగ్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. మొదట సినిమాలో మహేష్ బాబు ఓ ముఖ్యపాత్ర పోషించే అవకాశాలున్నాయని భారీ స్థాయిలో స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు జనాలు. కట్ చేస్తే.. మహేష్ స్థానంలో చరణ్ వచ్చాడు. హీరోయిన్ విషయంలో కూడా అదే జరిగింది. తొలుత చిరంజీవి సరసన త్రిషను ఎంపిక చేశారు.

అనంతరం ఆమె సినిమా నుంచి డేట్స్ ఇష్యు కారణంగా బయటకు వచ్చేసింది. తర్వాత ఆమె స్థానంలో కాజల్ ను తీసుకొన్నారు. దీనంతటికంటే సినిమాలో చరణ్ రోల్ ఏమిటి అనే విషయమై ఎప్పట్నుంచో చిన్నపాటి కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. “ఆచార్య”లో చరణ్ యువ చిరంజీవిగా కనిపిస్తారని కొందరు, చిరంజీవిని ఎదిరించే యువకుడిగా కనిపిస్తారని ఇంకొందరు రకరకాల పుకార్లు రేపారు. దాంతో సినిమాలో చరణ్ రోల్ ఏమిటి అనేది క్లారిటీ లేకుండాపోయింది.

అయితే.. ఈనెలలో రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని మార్చి 27న “ఆచార్య”లో చరణ్ లుక్ ను రిలీజ్ చేయనున్నామని సూత్రప్రాయంగా చెప్పేందుకు ఆచార్య టీం రిలీజ్ చేసిన ఫోటోలో చరణ్ భుజం మీద చిరంజీవి చెయ్యి కనిపించేసరికి ఫ్లాష్ బ్యాక్ లు గట్రా ఏమీ లేవని, చిరంజీవి-చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని క్లారిటీ వచ్చేసింది జనాలకి. దాంతో.. అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ లు పెట్టి కొరటాల ఆ మాస్ ఫార్ములాను రిపీట్ చేయకుండా మంచి పని చేస్తున్నాడని మెచ్చుకోవడం మొదలెట్టారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.