గోరంత విషయానికి కొండంత పబ్లిసిటీ అవసరమా ?

హీరోయిన్లు తాము చేసే చిన్న చిన్న పనులతో భారీస్థాయిలో పబ్లిసిటీ పొందాలని ప్రయత్నించడం అనేది కొత్తగా జరిగే అంశం ఏమీ కాదు. ఈ విషయంలో పొలిటీషియన్స్ కి ఏమాత్రం తీసిపోరు మన హీరోయిన్లు మరియు వారి పి.ఆర్ టీం. అయితే.. తాజాగా కైరా అద్వానీ పి.ఆర్ టీం ఆమె చేసిన ఒక సరదా పనిని పబ్లిసిటీ చేసిన తీరు ఇంటర్నెట్ లో ఆమె పరువు తీసినట్లైంది. హీరోయిన్లు అప్పుడప్పుడు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ యూజ్ చేయడం.. దాన్ని వాళ్ళ పి.ఆర్ టీం ఏదో గొప్ప పని చేసినట్లుగా పబ్లిసిటీ చేయడం చాలా కామన్ గా జరిగే విషయం. ఆ తరహాలోనే ప్రస్తుతం బాలీవుడ్ & టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన కైరా అద్వానీ ఆటోలో ట్రావెల్ చేయడాన్ని తన పి.ఆర్ టీం ఆమె చేసిన ఘనకార్యంగా పబ్లిసిటీ చేశారు.

kiara-advani-took-auto-rickshaw-to-reach-her-car1

కట్ చేస్తే.. కైరా ఆటోలో ప్రయాణించిన సమయం రెండు నిమిషాలు. అది కూడా స్టూడియో గేట్ నుంచి తన కార్ వరకు వెళ్ళడం కోసం. ఈమాత్రం దానికి కైరా ఏదో పెద్ద ఘనకార్యం చేసేసింది అన్నట్లుగా పబ్లిసిటీ చేయడం అనేది ఎవరికీ అర్ధం కాలేదు సరికదా.. తర్వాత ఆమెను ఆమె పి.ఆర్ టీం చేసిన హడావుడికి నవ్వుకున్నారు. అందుకే కాస్త ఆలోచించి ఇలాంటి పనులు చేయాలి.

Share.