ఇంకా డీసెంట్ రన్ కొనసాగుతూనే ఉంది..!

‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ బ్యానర్ పై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ , ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన తాజా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్ట్ చేసాడు. ఈ డైరెక్టర్ మొదట సందీప్ కిషన్ తో ‘నగరం’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక కార్తీ గత చిత్రం ‘దేవ్’ కూడా డిజాస్టర్ కావడంతో.. మొదట ‘ఖైదీ’ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు.

Khaidi Movie Review1

ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు ఈ చిత్రం కొన్న ప్రతీ బయ్యర్ కు లాభాలు తెచ్చిపెట్టింది. మధ్యలో చాలా సినిమాలు వచ్చి వెళ్ళినప్పటికీ ఇంకా లిమిటెడ్ స్క్రీన్స్ లో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. ఇప్పటికీ డీసెంట్ వసూళ్ళను రాబడుతుంది ఈ చిత్రం. ఈ చిత్రం ఇప్పటి వరకూ 7 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది తెలుస్తుంది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనా ఓ తమిళ చిత్రం ఇన్ని రోజులు డీసెంట్ రన్ కొనసాగించడం అంటే మాటలు కాదు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.