‘మిస్ ఇండియా’ అంటే ఒక బ్రాండ్!

మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ‌ న‌టి అవార్డును ద‌క్కించుకున్న నటి కీర్తి సురేష్ న‌టించిన తాజా చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వెనక్కి వెళ్లింది. ప్రమోషన్స్ లో భాగంగా ఒక పాట విడుదల చేసిన యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్ చేయాలనుకునే ఓ మహిళ కథే ఈ సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సంయుక్త అనే అమ్మాయి తన కలను నెరవేర్చుకోవడం కోసం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొందనే కాన్సెప్ట్ తో ‘మిస్ ఇండియా’ను తెరకెక్కించారు. ఈ సన్నివేశాలనే ట్రైలర్ లో చూపించారు. ”జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామని కాదు.. ఎంత ఆనందంగా ఉన్నామనేదే ముఖ్యం” అనే డైలాగ్ ఆకట్టుకుంది. అలానే కీర్తి సురేష్.. విలన్ జగపతి బాబుకి సున్నితంగా వార్నింగ్ ఇచ్చే సీన్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది.

Keerthy Suresh Miss India Movie Trailer Review1

ఇక ఈ సినిమాను నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పై విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వి.కె.న‌రేశ్‌, న‌వీన్ చంద్ర, న‌దియా, రాజేంద్ర ప్రసాద్‌, భాను శ్రీ మెహ్ర, పూజిత పొన్నాడ‌, క‌మ‌ల్ కామ‌రాజు ముఖ్య పాత్రల్లో నటించారు. సుజిత్ వాసుదేవ్, డాని షాన్‌సెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించారు.


కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Share.