Keerthy Suresh: కీర్తి సురేష్.. మొదటిసారి ఇలా ఘాటుగా

మహానటి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసుకున్న కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అవసరం అయితే గాని కొంత డోస్ పెంచడం లేదు. వీలైనంత వరకు ఆమె రొమాంటిక్ సన్నివేశాలకు ఒప్పుకోదు. కథ నచ్చితే మాత్రం లైన్ దాటకుండా పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమె మొదటిసారి ఒక పాత్ర కోసం కొంత అందాలను కెమెరా ముందు అందంగా ప్రజెంట్ చేసింది.

స్లీవ్ లెస్ లో ఒక మహారాణి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. చూపించి చూపించకుండా నాడుమందాలను కూడా బాగానే ప్రజెంట్ చేసింది. మళయాళంలో తెరకెక్కుతున్న మోహన్ లాల్ బిగ్ బడ్జెట్ మూవీ మరక్కర్ సినిమా కోసం ఇలా రెడీ అయ్యిందట. ఇక ఆ సినిమాను దాదాపు 100కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పాత్ర బాగా కనెక్ట్ అవ్వడంతో కీర్తి ట్రెడిషనల్ లుక్కులొనే గ్లామర్ డోసును పెంచేసింది.

ఫొటోలనే ఇంత అందంగా ఉందంటే ఇక సినిమాలో అమ్మడు ఇంకెంత అందంగా ఉంటుందో అని అభిమానులు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక తెలుగులో కీర్తి సురేష్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలకు కుడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.