Keerthy Suresh: కీర్తి సురేష్ కూడా మెల్ల మెల్లగా రూటు మారుస్తుంది..!

రష్మిక,కీర్తి సురేష్ ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్లే..! మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఉండగానే వీరిద్దరికీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కీర్తి సురేష్.. కు ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఛాన్స్ రావడంతో అందరి దృష్టి ఆమె పై పడింది. ఆ తర్వాత వచ్చిన ‘మహానటి’ చిత్రం ఈమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కట్టబెట్టింది. ఇక రష్మిక కూడా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఛాన్స్ కొట్టిన తర్వాత పెద్ద డైరెక్టర్ల దృష్టిలో పడింది.

ఆ తర్వాత వచ్చిన ‘భీష్మ’ కూడా సూపర్ హిట్ అవడం ఈమెకు స్టార్ దక్కడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ విషయంలో కీర్తి సురేష్ రష్మికనే ఫాలో అవుతున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేటర్ ఏంటంటే.. ఈ మధ్యకాలంలో రష్మిక గ్లామర్ డోస్ పెంచింది. బాలీవుడ్ లో సినిమాల్లో నటిస్తుంది కాబట్టి..ఆమె ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది. కొత్త హెయిర్ స్టైలిస్ట్ లను మేకప్ మెన్ లను పెట్టుకుని అక్కడి పద్దతికి తగ్గట్లు మేకోవర్ మార్చుకుంది.

ఈ మధ్యకాలంలో రష్మిక గ్లామర్ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటోంది. జిమ్ కి కూడా వెళ్తూ తెగ వర్కౌట్లు చేస్తుంది ఈ బ్యూటీ.ఇప్పుడు కీర్తి సురేష్ కూడా మెల్ల మెల్లగా రష్మిక బాటలోనే నడుస్తుంది. ఆమె కూడా తన హెయిర్ స్టైలిస్ట్ అలాగే మేకప్ టీం ను మార్చిందట. కొత్త మేకోవర్ తో ఈమె కూడా గ్లామర్ రూట్లోకి వెళ్తున్నట్టు స్పష్టమవుతుంది.అంతేకాదు ఈమె కూడా యోగ చేయడం మొదలుపెట్టిడం విశేషం.

1

2

3

4

5

6


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతు

Share.