అప్పుడే 60 ఏళ్ళ హీరోలతో జతకట్టడానికి రెడీ అయిన కీర్తి సురేశ్..!

సాదరణంగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చిన తరువాత చిన్న హీరోలతో అలాగే సీనియర్ హీరోలతో కాకుండా.. మిడిల్ ఏజ్డ్ స్టార్ హీరోలతో చేయడానికే ఎక్కువ చూపిస్తుంటారనేది వందకు వంద శాతం నిజం. కుర్ర హీరోలతో చేస్తే మార్కెట్ పడిపోతుందని … ఒక వేళ సీనియర్ హీరోలతో చేస్తే స్టార్ హీరోలు పక్కన పెట్టి.. కుర్ర హీరోలు కూడా ఛాన్స్ ఇవ్వరేమో అని వారి భయం కావచ్చు. కానీ కీర్తి సురేష్ మాత్రం వీటికి భిన్నంగా ఉంది.

keerthy-suresh-with-rajikanth

ఇప్పటికే 50 ఏళ్ళ వయసు ఉన్న విక్రమ్ తో ‘సామి’ సినిమా చేసిన కీర్తి … ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సరసన నటించడానికి రెడీ అయిపొయింది. ‘దర్బార్’ తర్వాత రజినీ శివ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ ను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసిందట. రజినీ సరసన హీరోయిన్ అవకాశం రావడం గొప్ప విషయమే.. కానీ అంత పెద్ద వయసున్న హీరోతో వర్క్ చేస్తే మళ్ళీ స్టార్ హీరోలు, కుర్ర హీరోలు ఈమెకు అవకాశాలు ఇస్తారా అనేది పెద్ద చర్చకు దారి తీసింది.

keerthy-suresh-with-rajikanth1

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.