అజయ్ దేవగన్ సినిమాలో సూపర్ ఛాన్స్ కొట్టేసిన కీర్తి

సావిత్రమ్మ జీవితాన్ని వెండితెర మీద అత్యంత అద్భుతంగా ఆవిష్కరించిన “మహానటి” చిత్రంలో సావిత్రిగా నటించి విశేషమైన పేరు సంపాదించుకొన్న కీర్తి సురేష్.. ఇటీవలే నేషనల్ అవార్డ్ సైతం గెలుచుకోవడం గర్వకారణం. ప్రస్తుతం తెలుగులో ఒక మహిళా ప్రధాన చిత్రం, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న కీర్తి.. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా ఏదో ఆషామాషీ సినిమా కాదండోయ్.. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న “మైదాన్” అనే బయోపిక్ లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

keerthy-suresh-bollywood-entry-fixed1

“బదాయ్ హో” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఇండియన్ ఫుట్ బాల్ టీం కోచ్ అబ్దుల్ రహీమ్ గా కనిపించనుండగా.. ఆయన సతీమణి పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసే ఆలోచనతోనే కీర్తి సురేష్ ను కథానాయికగా ఎంచుకొన్నారు. అప్పటికి “ఆర్.ఆర్.ఆర్”తో అజయ్ దేవగన్ కి కూడా తెలుగులో మంచి గుర్తింపు లభిస్తుంది.

Share.