పగ తీర్చుకుంటానంటున్న స్టార్ హీరోయిన్!

‘మహానటి’ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కీర్తి సురేష్. వరుస సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో బిజీగా మారింది. లాక్ డౌన్ లో ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలో ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే ఆ సినిమాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో కొంతకాలం పాటు లేడీ ఓరియెంటెడ్ కథలకు ఫుల్ స్టాప్ పెట్టి కమర్షియల్ సినిమాలపై దృష్టి పెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ఆమెకి చాలా మంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతున్నాయి.

మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. అలానే మెగాస్టార్ నటించనున్న ‘వేదాళం’ సినిమా రీమేక్ లో చిరుకి చెల్లెలుగా కనిపించనుందని టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ సరసన ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తోంది. సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా సెట్ లో కీర్తి నిద్రపోతుండగా.. ఫోటో తీసిన నితిన్, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అంటూ నితిన్ ని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.