Kangana Ranaut: కంగన కొత్త బయోపిక్‌పై అనుమానాలు!

కంగన్‌ రనౌత్‌కి బయోపిక్స్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన జీవితకథలు మంచి విజయం అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో నటిస్తోంది. దీని తర్వాత కూడా ఆమె మరో బయోపిక్‌లోనే నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బయోపిక్‌ గురించే బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె ఎంచుకున్న బయోపిక్‌ ఇందిరా గాంధీ జీవితం కాబట్టి. ఇంతకీ ఏంటా చర్చ అంటే… దేశంలో ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ, సామాజిక పరిస్థితులు వివరించేలా కంగన..

ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గతంలో తెలిపారు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన పనులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మేకప్‌ కోసం ఫేస్‌ స్కానింగ్స్‌ మొదలుపెట్టారు. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్‌… కంగన ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపిస్తుందా. ఆమె ప్రస్తుతం దేశంలో ఓ పార్టీకి అనుకూలం అనేది… ఆమె వ్యాఖ్యలు, సోషల్‌ మీడియా పోస్టులతో తెలిసిపోతుంది. ఈ సమయంలో ఆమె అదే తరహాలో ఆలోచించి సినిమా తీస్తుందా అనేది డౌట్‌.

మరోవైపు కంగన జీవిత కథల్ని తనకు నచ్చినట్లు మార్చి తీస్తారని గతంలోనూ విమర్శలు వచ్చాయి. ‘మణికర్ణిక’ విషయంలో సోనూ సూద్‌ పాత్ర తొలగింపు కోసం… ఆమె కథలో మార్పులు చేశారని విమర్శలు వచ్చాయి. అయితే ఆమె అవేవీ పట్టించుకోకుండా సినిమా చేసి విడుదల చేశారు. ఏకంగా దాని కోసం దర్శకుడినే పక్కనపెట్టారు. అలాంటి కంగన ఇప్పుడు ఇందిరా గాంధీ గురించి పక్కాగా జరిగింది, జరిగినట్లు చూపిస్తుందా అనేదే కొంతమంది డౌట్‌.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Share.