‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్2 తో మళ్ళీ పవన్ ఫ్యాన్స్ ను కెలికాడు..!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. టైటిల్ తోనే పెద్ద దుమారం రేపిన వర్మ ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లతో జనాల్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న కొన్ని వివాదాస్పద సంగటల్ని తీసుకుని వర్మ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ స్పష్టంచేసింది. ఇప్పుడు మరో ట్రైలర్ ను విడుదల చేసి ఈ చిత్రం పై జనాల్లో ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచేలా చేసాడు వర్మ.

Kamma Rajyam Lo Kadapa Reddlu New Trailer1

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గెలిచిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూపిస్తూ ఈ ట్రైలర్ సాగింది.’కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశం చేసాడు’ అంటూ చంద్రబాబు నాయుడు ని విమర్శిస్తూ ఉన్న డైలాగ్ తో ట్రైలర్ ఊపందుకుంది.. మొదటి ట్రైలర్ అంత ఆసక్తికరంగా లేకపోయినా ఈ ట్రైలర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. పవన్ కళ్యాణ్ ను సైతం వర్మ వదిలిపెట్టలేదు. 2019 ఎన్నికల్లో హైలెట్ అయిన పవన్ కళ్యాణ్ స్పీచ్ లు, కేఏ పాల్ కామెడీ, లోకేష్ తెలివితక్కువతనం వంటివి ట్రైలర్ లో చూపించాడు. ఈ ట్రైలర్ లో ఇంత చేసిన వర్మ పవన్ కళ్యాణ్ అభిమానులకి మంట పెట్టకపోతే బాగోదు అనుకున్నాడేమో… ఆయన ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన కత్తి మహేష్ తో ‘నాకొక ఐడియా వచ్చింది… పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తే’ అనే డైలాగ్ పెట్టి వారిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. ఈ ట్రైలర్ తో సినిమాని చూడాలి అనే ఆసక్తి మరింత పెంచాడు వర్మ. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.