ఇండియన్ 2 షూటింగ్ కోసం సెంట్రల్ జైల్లో శంకర్-కమల్

కమల్ హాసన్ డ్రీమ్ ప్రొజెక్ట్ అయిన “ఇండియన్ 2” బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఆగిపోయిందని వార్తలు రావడం, ఆ వార్తల్ని టీం మెంబర్స్ కానీ కమల్ హాసన్ కానీ ఖండించకపోవడం, కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో బిజీ అవ్వనుండడంతో అందరూ అది నిజమే అనుకున్నారు. కట్ చేస్తే.. “ఇండియన్ 2” ఆగిపోలేదని, ఒక చిన్న షెడ్యూల్ పూర్తయ్యిందని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుందని కాజల్ అప్పట్లో క్లారిటీ ఇచ్చింది.

kamal-haasan-resumes-shoot-in-rajamundry-central-jail1

ఇప్పుడు ఆ సినిమా కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. రాజమండ్రిలోని సెంట్రల్ జైల్లో కమల్ హాసన్, సిద్ధార్థ్ కాంబినేషన్ సీన్స్ తీస్తున్నాడు శంకర్. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో విడుదలకు సిద్ధమవుతుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ మరో కథానాయికగా నటిస్తోంది. పలువురు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతోపాటు.. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలనేది శంకర్ ప్లాన్.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.