నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్..!

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు తెరకెక్కుతోన్న చిత్రంతో బాలయ్య- బోయపాటి కచ్చితంగా హ్యాట్రిక్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజున ఈ చిత్రానికి సంబంధించి.. ‘బి.బి3 ఫస్ట్ రోర్’ పేరుతో ఓ చిన్న ప్రోమోని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన స్పందన లభించింది. దాంతో ఈ సినిమా పై అమాంతం అంచనాలు పెరిగిపోయాయనే చెప్పాలి.

అయితే ఈ చిత్రం టైటిల్ ఏంటి అనే విషయం పై చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ- బోయపాటి సినిమాలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు అనే టాక్ ఇప్పుడు ఊపందుకుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఓ చిన్న సీన్లో కళ్యాణ్ రామ్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇది నిజమే అయితే నందమూరి అభిమానులకు పండగనే చెప్పాలి.

ఇక కళ్యాణ్ రామ్ మరో పక్క ఓ సోసియో ఫాంటసీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు.40కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం.మరో విశేషం ఏమిటంటే ఈ ప్రాజెక్టుని కళ్యాణ్ రామే నిర్మించబోతున్నాడట.కరోనా లాక్ డౌన్ కు ముందే ఈ చిత్రానికి సంబంధించి ఓ సెట్ కూడా వేశారని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.