ఐడియా వాడారు థ్యాంక్స్ కూడా చెప్పలేదు..!

క్రాక్ సినిమా ఫైనల్ ఎండింగ్ కలక్షన్స్ దుమ్మురేపాయనే చెప్పాలి. అంతేకాదు, ఆహా ఫ్లాట్ ఫార్మ్ పైన కూడా ఈసినిమా అత్యధిక వ్యూస్ తో దుమ్మురేపుతోంది. రవితేజ – శృతిహాసన్ జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పండగ కంటే ముందే థియేటర్స్ లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచనల విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా వేటపాలం బ్యాచ్ తో ఫైటింగ్ సీన్స్, రవితేజ పోలీస్ పవర్, సముద్ర ఖని విలనిజం ఇవన్నీ కూడా సిినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

ఇక కాన్సెప్ట్ పరంగా చూస్తే 50నోటు, మామిడికాయ, మేకు అనే మూడు ఎలిమెంట్స్ కూడా సినిమాకి కొత్తదనాన్ని అదించాయి. నిజానికి ఈ ఐడియా ఇచ్చింది హీరో కళ్యాణ్ రామ్ అని, వెంకటేష్ వాయిస్ కూడా తనే సజెస్ట్ చేశాడని టాక్. ఎందుకంటే, ముందుగా ఈ కథని గోపిచంద్ మలినేని కళ్యాణ్ రామ్ కి వినిపించాడు. ఈ సినిమాని చేద్దామని కూడా ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. అయితే, కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ లేట్ అవుతుండటంతో కళ్యాణ్ రామ్ కి చెప్పి మలినేని గోపిచంద్ రవితేజతో ఈ సినిమా కమిట్ అయ్యాడు. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి కథలో కొన్ని మార్పులు చేసుకున్నారు.

అయితే, ఇప్పుడు సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ మీట్స్ కూడా జరిగాయి. కానీ ఎక్కడా కూడా కళ్యాణ్ రామ్ కి థ్యాంక్స్ కూడా చెప్పలేదు మూవీ టీమ్. ఇది తెలిసిన చాలామంది సినీ ప్రముఖులు థ్యాంక్స్ చెప్తే ఏమవుతుంది.. అంటూ మాట్లాడుకుంటున్నారట. అంతేకాదు, క్రాక్ సినిమా వసూళ్ల పరంగా కూడా రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ని సాధించింది. కనీసం ఈ విషయం చెప్తూ అయినా డైరెక్టర్ చిన్న ట్వీట్ చేసినా సరిపోతుంది కదా అని గుసగుసలాడుకుంటున్నారు చాలామంది. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.