సంక్రాంతి పోరులో జంకాల్సిన అవసరం లేదంటున్న కళ్యాణ్ రామ్

ఒకవైపు “సరిలేరు నీకెవ్వరు” మరోవైపు “అల వైకుంఠపురములో” సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాయి. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి కానీ.. వీక్ డేస్ లోనూ తగ్గు ముఖం పట్టడం లేదు. ఇలా రెండు పెద్ద సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండగా.. సాధారణంగా అయితే మరో సినిమా విడుదలవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించదు. కానీ.. కళ్యాణ్ రామ్ మాత్రం తన తాజా చిత్రం “ఎంత మంచివాడవురా”ను చాలా కాన్ఫిడెంట్ గా రేపు విడుదల చేస్తున్నాడు.

Entha ManchiVaadavuRaa Movie completes censor formalities

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన “ఎంత మంచివాడవురా” చిత్రానికి చాలా మంచి పాజిటివ్ బజ్ ఉంది. మెహరీన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని రేపు “సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో” చిత్రాలకు పోటీగా విడుదల చేస్తున్నారు. ఈ టైంలో ఇలాంటి రిస్క్ ఎందుకు అని కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించగా.. “సంక్రాంతి చాలా పెద్ద పండుగ.. పెద్ద సినిమా అయిదు విడుదలైనా సూపర్ హిట్ కొడతాయి. అలాంటిది మా చిన్న సినిమా హిట్ కోట్టదంటారా.. అయినా మా సినిమా కంటెంట్ మీద మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా “ఎంత మంచివాడవురా”. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది” అని సమాధానమిచ్చాడు కళ్యాణ్ రామ్. మరి కళ్యాణ్ కాన్ఫిడెన్స్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.