అవికా గోర్ తో రొమాన్స్ చేయబోతున్న మెగా హీరో..!

‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్… మొదటి చిత్రంతోనే పెద్ద డిజాస్టర్ ను చవి చూసాడు. సినిమా ఓకే అనే కామెంట్స్ వచ్చినప్పటికీ కళ్యాణ్ నటన ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు కళ్యాణ్ దేవ్. దీంతో ఇతని రెండో సినిమాకి మెగాస్టార్ చిరంజీవితో సహా మిగిలిన హీరోలంతా తమ వంతు సాయం చెయ్యడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ పులి వాసు డైరెక్షన్ లో ‘సూపర్ మచ్చి’ అనే చిత్రం చేస్తున్నాడు.

ఈ చిత్రం విషయంలో చిరు చాలా జాగ్రతలు తీసుకుంటున్నారట. ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ దేవ్… శ్రీధర్ సీపాన డైరెక్షన్లో ఓ రొమాంటిక్ మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అవికా గోర్ ను తీసుకోబోతున్నట్టు సమాచారం. ‘చిన్నారి పెళ్ళి కూతురు’ సీరియల్ తో ఈ బ్యూటీకి బాగా క్రేజ్ ఏర్పడింది. దానితోనే ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్ గా మారింది.ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో… తరువాత ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.

Kalyan Dev To Romance With Avika Gor1

‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘ సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది. ఆ టైములో ఈమె లావుగా అయ్యింది అనే విమర్శలు రావడంతో … బరువు తగ్గి మళ్ళీ ‘రాజుగారి గది3’ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ .. ఆ సీక్వెల్స్ పై ఉన్న నమ్మకం … అలాగే లో బడ్జెట్ లో తియ్యడంతో కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు అవికా గ్లామర్ షోకి కూడా సై అంటుంది కాబట్టి…చిరు చిన్న అల్లుడు కి కలిసొచ్చినట్టే..!

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.