హానెస్ట్ ట్రైలర్.. నిజంగా హానెస్ట్ గా ఉంది..!

‘పి.ఎస్.వి గరుడవేగ’ చిత్రంతో దాదాపు 10 ఏళ్ళ తరువాత హిట్టందుకున్నాడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్. ఆ హిట్టందుకున్న జోష్ లో ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ‘కల్కి’ చిత్రం చేసాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇక జులై 28 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు వేగవంతం చేసారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా.. ఈ చిత్రానికి సంభందించిన హానెస్ట్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

kalki-trailer-review1

kalki-trailer-review2

‘ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి’ అంటూ సాగే డైలాగ్‌ తో ట్రైలర్‌ మొదలైంది. ఈ ట్రైలర్ రాజశేఖర్ మరింత స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం రాముడే’ అంటూ నాజర్ పలికిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఆ వెంటనే రాజశేఖర్‌ గొడ్డలి పట్టుకుని నరకడం వంటి షాట్స్ హై లెవెల్ లో ఉన్నాయి. నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంది. మొత్తానికి ట్రైలర్ మాత్రం సినిమా పై అంచనాల్ని మరింత పెంచేలా ఉంది.

Share.