రాజశేఖర్ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

‘పి.ఎస్.వి గరుడవేగ’ చిత్రంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మన యాంగ్రీ యంగ్ మ్యాన్.. ఇప్పుడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్. ఆయన హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘కల్కి’ . 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ‘అ!’ వంటి డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకర్షించిన ఈ యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నాడు. ‘శివానీ శివాత్మిక మూవీస్’ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో ‘హ్యాపీ మూవీస్’ బ్యానర్ పై సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ కలిసి నిర్మిస్తున్నారు.

kalki-movie-teaser-review1

kalki-movie-teaser-review2

ఇక తాజాగా విడుదలయిన ఈ టీజర్ చాలా స్టైలిష్ గా కట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా క్లారిటీగా ఉంది. ఈ టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు,హైలెట్ అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోరే…! ఇక టీజర్ లో చూపించిన విజువల్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ చివర్లో రాజశేఖర్ కనిపించాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు.. ‘హార్ట్ ఎటాక్‌’ హీరోయిన్ ఆదా శ‌ర్మ ఒకరు కాగా, ‘బాహుబ‌లి ది బిగినింగ్‌’ లో మనోహరి సాంగ్లో అందాలు ఆరబోసిన స్కార్‌లెట్ విల్స‌న్, అలాగే ‘ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ’ ఫేం నందిత శ్వేత. ఈ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Share.