కల్కి

“పి.ఎస్.వి గరుడ వేగ” చిత్రంతో కథానాయకుడిగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ నటించిన తాజా చిత్రం “కల్కి”. “అ!” చిత్రంతో యావత్ ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకొన్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ మొదలుకొని ట్రైలర్ వరకూ అన్నీ విశేషమైన ఆసక్తిని రేకెత్తించాయి. మర్డర్ మిస్టరీ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రంతో రాజశేఖర్ మరోమారు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

kalki-movie-review1

కథ: 1980లో తెలంగాణకు చెందిన కొల్లాపూర్ అనే గ్రామంలో చోటు చేసుకొన్న శేఖర్ బాబు (సిద్ధూ జొన్నలగడ్డ) అనే వ్యక్తిని చెట్టుకి కట్టేసి కాల్చేస్తారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సప్ప (అశుతోష్ రాణా) తమ్ముడే శేఖర్ బాబు కావడంతో ఊర్లో పరిస్థితులు గతి తప్పుతాయి. దాంతో ఆ పరిస్థితులను సర్ధుమణిగేలా చేయడం మరియు హంతకుడ్ని పట్టుకోవడం కోసం ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ గా కల్కి ఐ.పి.ఎస్ (రాజశేఖర్)ను నియమిస్తుంది.

కేస్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టిన కల్కికి ఈ హత్య వెనుక చాలా పెద్ద రహస్యం ఉందని.. కొల్లాపూర్ లోని జాతర కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయుడు దేవదత్తా (రాహుల్ రామకృష్ణ) ద్వారా తెలుస్తుంది.

అసలు శేఖర్ బాబును హత్య చేసింది ఎవరు? ఈ ఇన్వెస్టిగేషన్ లో కల్కి ఎదుర్కొన్న సమస్యలేమీటీ? కొల్లాపూర్ రహస్యం ఏమిటి? అనేది “కల్కి” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

kalki-movie-review2

నటీనటుల పనితీరు: మరి డి.ఐ సరిగా చేయలేదో లేక సీజీ చేసే టైమ్ పోస్ట్ ప్రొడక్షన్ టీం కి ఇవ్వలేదో తెలియదు కానీ.. రాజశేఖర్ లుక్స్ ఈ చిత్రంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో ఆయన్ని చూసి “ఏంటి రాజశేఖర్ ఇలా పేషంట్ లా అయిపోయాడు?” అని ప్రేక్షకులు అనుకొనే సందర్భాలు చాలా ఉన్నాయి. పోస్టర్స్ లో ఫోటోషాప్ తో ఏదో కవర్ చేశారు కానీ.. సినిమాలో మాత్రం రాజశేఖర్ లుక్స్ బాలేవు. మేకప్ కూడా ఎందుకో సెట్ అవ్వలేదు. మొదటిసారి ఎందుకో రాజశేఖర్ యాక్టింగ్ కి సాయికుమార్ డబ్బింగ్ కి సింక్ అవ్వలేదనిపించింది. ప్రీక్లైమాక్స్ లో వచ్చే రాజశేఖర్ తెలంగాణ స్లాంగ్ డైలాగ్ కి లిప్ సింక్ కూడా అవ్వలేదు. దర్శకుడు ప్రేక్షకులకి విన్నవించుకొన్నట్లు.. పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకాస్త టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేది.

రాహుల్ రామకృష్ణ కామెడీ మొదట్లో పర్వాలేదనిపించినా.. మరీ సాగదీసినట్లుగా అనిపించింది. కథ మొత్తం రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ పాయింటాఫ్ వ్యూలోనే నడవడం బాగుంది.

అదా శర్మకి ఒక పాట, మూడు డైలాగులు, నాలుగు సీన్లు మాత్రమే రాశారు. ఆ పాట కూడా లేకపోతే.. హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాల్సి వచ్చేది. నందిత శ్వేతకు తన పాత్రకు న్యాయం చేసింది. కథలోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో ఆమె పాత్ర జనాలకు బాగానే గుర్తుండిపోతుంది.

అశుతోష్ రాణా విలనిజం కంటే వీరత్వమే (పడక గదిలో) ఎక్కువగా ఎలివేట్ చేశాడు దర్శకుడు. శత్రు, డి.ఎస్.రావు, నాజర్ పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి.

kalki-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: కెమెరామెన్ దాశరధి శివేంద్ర కెమెరా పనితనం మరియు సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్స్. దాశరధి శివేంద్ర కెమెరా టెక్నిక్స్ & యాంగిల్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ సరిగా అయ్యి ఉంటే ప్రేక్షకులకు కచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వగలిగేది. అయినప్పటికీ.. యాక్షన్ బ్లాక్స్ & స్లోమోషన్ షాట్స్ భలే కొత్తగా అనిపిస్తాయి. ఇక శ్రవణ్ భరద్వాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పీక్స్ లో ఉంది. సీన్ లో దమ్ము ఉన్నా లేకపోయినా.. తన నేపధ్య సంగీతంతో సన్నివేశంలోని ఇంటెన్సిటీని అమాంతం పెంచేశాడు.

దర్శకుడు ప్రశాంత్ వర్మకు బడ్జెట్ ఇవ్వలేదా లేక టైమ్ ఇవ్వలేదా అనేది తెలియదు కానీ.. ఓపెనింగ్స్ సీక్వెల్స్ లో స్కెచ్చులతో మూల కథ చెప్పడం వరకూ బాగానే ఉంది కానీ.. సినిమాకి చాలా కీలకమైన లాంచీల యాక్సిడెంట్ ఎపిసోడ్స్ ను కూడా స్కెచ్ లతో లాగించేయడం మైనస్ అయ్యింది. స్క్రీన్ ప్లే చాలా పకడ్బంధీగా రాసుకొన్న ప్రశాంత్ వర్మ.. దాన్ని తెరకెక్కించడంలో మాత్రం విఫలమయ్యాడు. జరిగేది యాధృచికం కాదు కర్మ అని నాజర్ చేత చెప్పించిన డైలాగ్ జస్టీఫికేషన్ కోసం రాసుకొన్న క్లైమాక్స్ మొన్నామధ్య వచ్చిన “సాక్ష్యం” చిత్రాన్ని గుర్తుకుతెస్తుంది.

kalki-movie-review4

విశ్లేషణ: కథ కొత్తది కాకపోయినా.. టేకింగ్ బాగుంది. కానీ.. ఆకట్టుకొనే కథనం, సరైన సీజీ వర్క్ లోపించింది. ముఖ్యంగా కథానాయకుడైన రాజశేఖర్ లుక్స్ బాగోలేవు. పైగా.. సాగదీసిన కథనం మైనస్ లుగా మారాయి. రాజశేఖర్ మీద అభిమానం, కాస్తంత ఓపిక ఉంటే “కల్కి” సినిమాను ఒకసారి చూడవచ్చు.

kalki-movie-review5

రేటింగ్: 2/5

CLICK HERE TO READ IN ENGLISH

Share.