కమల్ హాసన్ కోసం ముసలి ప్రేయసిగా కనిపించనున్న కాజల్

కాజల్ రీసెంట్ గా 34వ పడిలోకి అడుగుపెట్టింది కదా.. ఆమె వయసు 70 అని చెబుతారేంటి అనుకొంటున్నారా. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇప్పుడు కాజల్ వయసు నిజంగానే 70 ఏళ్ళు. అందుకు కారణం ఆమె నటిస్తున్న తాజా చిత్రమైన “భారతీయుడు 2”. ఇందులో కమల్ హాసన్ కు జంటగా కాజల్ నటిస్తుండగా.. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

rakul-preet-replaced-kajal-aggarwal-in-bharateeyudu2-movie

అయితే.. ఈ చిత్రంలో కమల్ హాసన్ 90 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నాడు. సొ, ఆయన ప్రేయసిగా/భార్యగా కనిపించనున్న కాజల్ 70 ఏళ్ల మహిళగా కనిపించనుంది. ఇందుకోసం స్పెషల్ మేకప్ గట్రా అన్నీ మామూలే అనుకోండి. అలాగే.. కాజల్ ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొంది. కాజల్ కెరీర్ లో ఆమె నటిస్తున్న కాస్ట్లీయస్ట్ సినిమా ఇదే. ఇకపోతే.. కాజల్ తెలుగులో “రణరంగం” అనంతరం మరో సినిమా సైన్ చేయలేదు. రణరంగంలోనూ కాజల్ క్యారెక్టర్ ఎందుకు ఉంది అనే విషయం ఆమెతోపాటు ఆమె అభిమానులకు కూడా అర్ధం కానీ విషయం.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.