బాలీవుడ్ పై అంత మోజు ఎందుకు కాజల్..!

టాలీవుడ్ లో ఓ రెండు హిట్లు కొట్టినా… లేక వరుస ప్లాపులు పలకరించినా… హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీల వైపు లుక్కేస్తుంటారు. అందులో వారి ఆశలు ఎక్కువ బాలీవుడ్ వైపే ఎక్కువ ఉంటుంది. ఆ కలని నెరవేర్చుకోవడానికి హీరోయిన్లు తెగ ట్రై చేస్తుంటారు. ఒకసారి అవకాశం వచ్చి ప్లాపులైనా పలకరించినా సరే… బాలీవుడ్ పై మోజు మాత్రం తగ్గదు. అలా ఒకటి రెండు సార్లు ట్రై చేసి చేతులు కాల్చుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా దశాబ్దం పైనే అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కాజల్ హిందీలో ‘సింగం, దో లఫ్జొంకి కహాని’ అంటూ రెండు సినిమాలు చేసి ప్లాపులందుకుంది.

kajal-latest-photoshoot-stills

ఇక తాజాగా… జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కనున్న’ముంబయి సాగ’ చిత్రానికి కాజల్ సైన్ చేసింది. ఈ చిత్రానికి ఆమె కేవలం 30 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. కోటికి తక్కువ తీసుకుని తెలుగు, తమిళ భాషల్లో ఒక్క సినిమా కూడా చేయదు కాజల్. ‘సీత’ ‘కవచం’ ‘రణరంగం’ వంటి చిత్రాలకైతే కోటి పైనే తీసుకుంది. మరి హిందీ సినిమాకి మాత్రం 30 లక్షలు మాత్రమే తీసుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Share.