రజినీని బుట్టలో పడేయడానికి ట్రై చేస్తుంది..!

ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది కాజల్ అగర్వాల్. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్. దాదాపు స్టార్ హీరోలతోను అలాగే సీనియర్ హీరోలతో కూడా ఈమె నటించేసింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, విజయ్, అజిత్ వంటి హీరోలతో నటించేసింది. ఇక ఇప్పుడు కమల్ సరసన ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా నటిస్తుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్టవుతుందని కాజల్ భావిస్తుంది. ఇక ఇప్పుడు ఆమె ఫోకస్ రజినీకాంత్ పై పడినట్టు తెలుస్తుంది.

rajinikanth-kajal-aggarwal

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ ..” తమిళంలో అజిత్ .. విజయ్ వంటి స్టార్ హీరోలతో హిట్ మూవీస్ చేశాను. కమల్ సార్ తో ‘ఇండియన్ 2’ చేస్తున్నాను. ఇన్నేళ్ళ నా కెరియర్లో రజనీకాంత్ సార్ కి జోడీగా నటించే అవకాశం దక్కలేదు. ఆ ఒక్క వెలితి ఉండిపోయింది. త్వరలో రజనీ సార్ తో నటించే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. కుర్ర హీరోయిన్లు ఎక్కువవ్వడంతో కాజల్ కు ఎక్కువ అవకాశాలు రావడం లేదు. అందుకే రజినీ వంటి సూపర్ స్టార్ పై ఫోకస్ పెడితే మళ్ళీ బిజీ కావొచ్చని కాజల్ భావిస్తున్నట్లుంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.