స్టార్ డైరెక్టర్ తో కాజల్ రొమాన్స్

కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. గత ఏడాది అక్టోబర్ లో పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ హనీమూన్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తరువాత రొమాంటిక్ సినిమాలు తగ్గించవచ్చనే రూమర్స్ కు కూడా చెక్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ త్వరలో ప్రభుదేవాతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా చాలా బిజీ అవుతున్న ప్రభుదేవా హీరోగా ఛాన్స్ వస్తే కూడా నటిస్తున్నాడు. ఇక చాలా రోజుల తరువాత ఒక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ లో నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. తమిళ్ దర్శకుడు డీకే డైరెక్ట్ చేయబోయే సినిమాలో కాజల్ ప్రభుదేవా రొమాంటిక్ కపుల్స్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. కాజల్ ప్రస్తుతం తెలుగులో మోసగాళ్ళు, ఆచార్య అనే సినిమాలతో బిజీగా ఉంది.

ఇక తమిళ్ లో ఇండియన్ 2 తో పాటు మరో మూడు సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో కూడా ముంబై అనే యాక్షన్ సినిమా చేస్తోంది. పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కెరీర్ ను ఇంకొన్నాళ్లు ఇలానే కొనసాగించాలని కాజల్ గట్టి ప్లానే వేసుకున్నట్లు అర్ధమవుతోంది. మరి ప్రభుదేవాతో చేస్తున్న సినిమాలో రొమాన్స్ డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.