వరుస ఫ్లాపుల కారణంగా రెమ్యూనరేషన్ తగ్గించింది

కాజల్ తగ్గింది అంటే.. సన్నబడింది అని అనడం లేదండీ. ఇక్కడ మేటర్ ఏంటంటే.. తెలుగులో హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. సినిమాకి ఏకంగా కోటిన్నర దాకా తీసుకొనే కాజల్ కి ఈమధ్యకాలంలో సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. “సీత, కవచం” చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడడం.. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేకపోవడంతో ఆమె క్రేజ్ కాస్త తగ్గింది.

kajal-latest-photoshoot-stills2

క్రేజ్ తోపాటు రెమ్యూనరేషన్ కూడా తగ్గుతుంది కదా. అందుకే.. ఆమె నటిస్తున్న తాజా హిందీ చిత్రం “ముంబై సాగా”కి కేవలం 58 లక్షల రెమ్యూనరేషన్ తీసుకొందట. మాములుగానే హిందీ సినిమాలకు మన తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకొంటారు. కానీ కాజల్ లాంటి నెంబర్ ఒన్ హీరోయిన్ కూడా తనకు తెలుగులో లభించే రెమ్యూనరేషన్ లో కేవలం మూడో వంతు రెమ్యూనరేషన్ కి సినిమా చేయడం అనేది ఆమె క్రేజ్ ఎంత తగ్గింది అనేందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగులో ప్రస్తుతం ఆమెకు పెద్దగా ఆఫర్లు లేవు. కొత్త హీరోయిన్ల హవా పెరగడం, ఇతర భాషాల నుండి స్టార్ హీరోయిన్స్ కూడా తెలుగులోకి రావడంతో కాజల్ క్రేజ్ బాగా తగ్గింది. మరి అమ్మడికి మళ్ళీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Share.