పెళ్లి తర్వాత కాజల్‌లో మార్పు వచ్చిందా?

ప్రతి నటుడు/నటికి డ్రీమ్‌ క్యారెక్టర్ అంటూ ఒకటి ఉంటుంది. అది కొంతమంది ఒకటో, రెండో సినిమాకు కుదిరిపోతుంది. ఇంకొందరికి సంవత్సరాలు గడిచినా… ఆ అవకాశం దక్కదు. కొందరు దాని కోసం ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు యాదృచ్ఛికంగా దొరికేస్తుంటాయి. మరికొందరు ఎప్పుడో ఒకసారి బయటకు చెప్పి అలాంటి పాత్రలు చేయాలని ఉంది అని చెబుతుంటారు. అలా ఎవరైనా కథలు రాసుకుంటే అవకాశాలు వస్తుంటాయి. తాజాగా కాజల్‌ డ్రీమ్‌ రోల్‌ ఏంటనేది తెలిసింది. అభిమానులతో ముచ్చటించడానికి సినిమా తారలు ఈమధ్యన సోషల్‌ మీడియాలో ప్రశ్న – జవాబు కార్యక్రమం పెడుతూ వస్తున్నారు.

నేరుగా అభిమానులతో మాట్లాడటం అన్న మాట. అలా కాజల్‌ కూడా ఇటీవల అదే పని చేసింది. ఈ క్రమంలో తన గురించి, తన సినిమాల గురించి, వ్యక్తిగత జీవితం గురించి చాలా వివరాలు తెలియజేసింది. అలా తను చిన్నతనం నుంచి వ్యోమగామి అవ్వాలని అనుకుండేది అనే విషయాన్ని తెలియజేసింది. అంతే కాదు అలాంటి పాత్ర వస్తే చేయాలని ఉంది అంటూ కోరిక కూడా వెలిబుచ్చింది. కాజల్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు చాలా రోల్స్‌ చేసింది. అయితే అవన్నీ సాధారణ పాత్రలే.

గ్లామర్‌, యాక్టింగ్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలే. ఆమెనే ప్రధానంగా చేసుకొని ఇంతవరకు దర్శకులు ఎవరూ సినిమాలు రాసుకోలేదు. మరి ఇప్పుడు ఆమెను ఆస్ట్రోనాట్‌గా చూపిస్తూ ఎవరన్నా కథ సిద్ధం చేస్తారేమో చూడాలి. పెళ్లి అయ్యింది కాబట్టి ఆమె కూడా సమంతలా ప్రయోగాత్మక సినిమాలు, నాయికా నేపథ్యం ఉన్న సినిమాలవైపు వచ్చేస్తుందేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి కథ ఎన్నో రోజులు పట్టదు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.