ఆర్ ఆర్ ఆర్ లో కీలకమైన సన్నివేశాన్ని లీక్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్

హెడ్డింగ్ చూసి ఇదేదో యూట్యూబ్ తంబ్ నైల్ అనుకోకండి. ఇది నిజంగా నిజం. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది సదరు షూట్ లో పాల్గొన్న నటుడే. “ఆర్ ఆర్ ఆర్”లో కీలకపాత్ర పోషిస్తున్న ఓ నటుడు ఇటీవల ఒక న్యూస్ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. “ఆర్ ఆర్ ఆర్”లో నటించిన ఆనందాన్ని మీడియాతో పంచుకుంటూ.. సినిమాలోని ఓ సన్నివేశాన్ని వివరించాడు. ఈ సీన్ లో ఎన్టీఆర్ & చరణ్ నడుమ ఓ భీకర పోరాటం ఉంటుందని.. చరణ్ ఏకంగా ఎన్టీఆర్ గుండెల మీద తంతాడని పేర్కొన్నాడు సదరు నటుడు.

RRR Movie New Still1

అంతే.. సదరు వీడియోను కట్ చేసి యూట్యూబ్ లో పెట్టడం.. ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ అవ్వడం, ఇరు హీరోల అభిమానులు ట్విట్టర్ సాక్షిగా గొడవపడడం మొదలయ్యింది. అయితే.. ఈ విషయమై వెంటనే స్పందించిన “ఆర్ ఆర్ ఆర్” టీం సదరు వీడియోను యూట్యూబ్ నుండి డిలీట్ చేయించడమే కాక.. ఫ్యాన్స్ వార్ డిస్కషన్ కూడా ట్విట్టర్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకొంది. ఇష్యూని బాగానే కంట్రోల్ చేశారు కానీ.. సినిమా మీద మాత్రం ఈ సీన్ గురించి కీలకమైన విషయాలు లీక్ అవ్వడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.