బల్గేరియాలో గొడవ పడుతున్న ఎన్టీఆర్?

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ ను డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళి కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్ళింది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పాల్గొంటాడట. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ఎన్టీఆర్ పై చిత్రీకరించబోతున్నాడట రాజమౌళి.

jr-ntr-ato-travel-to-bulgaria1

‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్…. ‘కొమరం భీం’ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆగష్టు 22న (గురువారం) ఈ చిత్ర యూనిట్ బల్గేరియా చేరుకున్నారు. ఇక రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక రాంచరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటించబోతుంది. ఎన్టీఆర్ కు ఇంకా హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు. అజయ్ దేవ్ గన్, సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Share.