రాజమౌళి కారణంగా చరణ్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా దర్శకుడు రాజమౌళిపై అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ అనుకున్న సమయానికి అందివ్వలేరని ఫీలయ్యారు. విషయంలోకి వెళితే రామ్ చరణ్ కి ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ పంపారట. ఆ గిఫ్ట్ చరణ్ కి చేర్చమని రాజమౌళికి పంపగా రాజమౌళి ఆ గిఫ్ట్ చరణ్ కి చేర్చడంలో లేటు చేశారట. దీనితో సారీ బ్రదర్ రామ్ చరణ్ నీకు అనుకున్న సమయానికి గిఫ్ట్ పంపలేక పోయాను.

రాజమౌళి సంగతి తెలుసుగా ఎప్పటిలాగే లేటు చేశారు అన్నారు. ఐతే ఇదంతా సీరియస్ వ్యవహారం కాదులెండి. నేడు చరణ్ పుట్టిన రోజు కానుకగా భీం ఫర్ రామరాజు పేరుతో ఓ స్పెషల్ వీడియో విడుదల చేయాల్సివుంది. ఆ వీడియో నేడు ఉదయం 10:00 గంటలకు విడుదల కావాల్సివుంది. ఐతే కారణం ఏదైనా ఆ స్పెషల్ వీడియో 10:00 గంటలకు బయటికి రాలేదు. దీనితో వీడియో విడుదల లేటైంది అనే విషయాన్ని ఎన్టీఆర్ సరికొత్తగా చమత్కరిస్తూ ఓ ట్వీట్ వేశారు.

Fans war over RRR Movie1

ఇక రెండు రోజుల క్రితం విడుదలైన ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ ని డి వి వి దానయ్య 400 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తుండగా, అలియా భట్, అజయ్ దేవ్ గణ్ వంటి బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ జనవరి 8,2021 లో విడుదల కానుంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.