మరో కాస్ట్లీ కారుని కొనుగోలు చేసిన తారక్.. ఫోటో వైరల్..!

మొన్నటికి మొన్న సుకుమార్ కూతురి హాఫ్ శారీ వేడుకకి హాజరైన తారక్.. ఏకంగా రూ.2340 విలువగల మాస్క్ ను ధరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతకు ముందు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహానికి వెళ్ళినప్పుడు రూ.25లక్షల విలువగల వాచ్ అలాగే రూ.75వేలు విలువగల షూస్ ను కూడా ధరించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ కొత్త కొత్త బ్రాండ్ ఐటమ్స్ ను వెంటనే కొనుగోలు చేస్తుంటాడు అన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా అతను మరో కాస్ట్లీ కారుని కూడా కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు నాలుగైదు కార్లు ఉన్నాయి.. కాగా ఇది మరొకటి అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘లాంబోర్గిని ఉరుస్’‌ అనే కారుని ఇటీవల ఎన్టీఆర్ కొనుగోలు చేశాడట.దీని ధర రూ.5కోట్లని తెలుస్తుంది. ఎన్టీఆర్ చాలా ఆశపడి ఈ ఇంపోర్టెడ్‌ కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.ఈ కారుని ఇటలీ నుండీ దిగుమతి చేయిస్తున్నారట.

ఇలా ఇంపోర్ట్ చెయ్యడం కోసం మరో రూ.10లక్షల వరకూ ఖర్చు అవుతుందని సమాచారం. ఏమైనా ఎన్టీఆర్ కొనుగోలు చేసాడు అని తెలియడంతో ఈ కారు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. అది కూడా పూర్తయిన తరువాత ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే మూవీలో కూడా నటించడానికి రెడీ అవుతున్నాడు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.