మహేష్ పుణ్యమాని ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు..!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్. ఆర్.ఆర్’ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రాన్ని 2020 జూలై 30 న విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ఇదివరకే ప్రకటించాడు. ఆ డేట్ నే టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ చిత్రం 2020 ఏప్రిల్ కు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ భారీ మల్టీ స్టారర్ పూర్తయ్యాక ఎవరి డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ‘వైజయంతి మూవీస్’ , ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థలకు ఎన్టీఆర్ సినిమాలు చేయాల్సి ఉంది.

jr-ntr-prashanth-neel-director-atlee

ఈ క్రమంలో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో చేసే చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తాడని.. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించే చిత్రానికి ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ … మహేష్ తో ఓ సినిమా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పూర్తయిన వెంటనే ప్రశాంత్ తో మహేష్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. దీంతో అట్లీ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి…!

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.