వైరలవుతున్న ఎన్టీఆర్ కొత్త వీడియో..!

‘బాహుబలి’ చిత్రం తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు జక్కన్న. ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ ఎప్పుడో పూర్తయ్యింది. అయితే రెండో షెడ్యూల్ షూటింగ్ సమయంలో ఇద్దరి హీరోలకు గాయాలు కావడంతో షూటింగ్ ఆగిపోయింది.

మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. చారిత్రాత్మక చిత్రం కావడంతో ఇందులో గుర్రపు స్వారీలు, భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. దీంతో ఎన్టీఆర్ ఓ గుర్రాన్ని మచ్చిక చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో గుర్రాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎన్టీఆర్ నానాతంటాలు పడుతున్నాడు. ఈ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి!


View this post on Instagram

#NTR Learning Horse Riding For #RRR Movie! #Rajamouli #RamCharan #Telugu #Tollywood #Actor

A post shared by Filmy Focus (@filmyfocus) on

Share.