2021లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ పై దండెత్తనున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ నేడు అధికారికంగా తన 30వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత మరోమారు దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీకి కమిట్ అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ ఏడాది మధ్యలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జూన్ లేదా జులై కల్లా పూర్తికానున్న తరుణంలో వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. జనవరి లేదా ఫిబ్రవరి మొదటివారానికి షూటింగ్ పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక మొత్తం ఇప్పటికే పూర్తయింది.

Jr NTR Latest Still

ఆర్ ఆర్ ఆర్ కారణంగా రెండేళ్లు ఫ్యాన్స్ కి వెండితెరపై కనిపించకుండా పోయిన ఎన్టీఆర్ ఆ లోటు తీర్చుతూ కేవలం రెండుమూడు నెలల వ్యవధిలో రెండు భారీ చిత్రాలు విడుదల చేసి వారి దాహం తీర్చనున్నాడు. ఇక అదే సంవత్సరం చివర్లో ఎన్టీఆర్ నుండి మరో చిత్రం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి . అదే జరిగితే 2021 లో ఎన్టీఆర్ నుండి మూడు సినిమాలు విడుదలైనట్లు అవుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం ఎన్టీఆర్ కొరకు స్క్రిప్ట్ సిద్ధం చేసి రెడీ గా ఉన్నారు. కాబట్టి త్రివిక్రమ్ మూవీ అనంతరం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం కలదు. ఏది ఏమైనా ఎన్టీఆర్ 2021లో ఫ్యాన్స్ ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫిదా చేయనున్నాడు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.