ఎన్టీఆర్ అంటే మెగా హీరోలకు అంత అభిమానం ఎందుకో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ కో స్టార్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జీ ని ఆయన ఆకాశానికి ఎత్తారు. ఓ నేషనల్ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ని ఎన్టీఆర్ గురించి అడుగగా, ఎన్టీఆర్ ఓ ఫైర్ క్రాకర్ అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఎనర్జిటిక్ మరియు హుషారుగా ఉంటారన్న చరణ్ తనతో కలిసి వర్క్ చేయడం చాలా ప్లెజర్ గా ఉంటుంది అని సమాధానం చెప్పాడు. అలాగే షూటింగ్ లేని సమయంలో ఎన్టీఆర్ ని చాల మిస్ అవుతున్నాను అని ఫీలయ్యారు.గత కొంత కాలంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి ముందు నుండే వీరు గ్యాధరింగ్స్ లో పాల్గొనేవారు. ఒకప్పుడు మెగా హీరోలకు, నందమూరి హీరోల మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. కానీ ఎన్టీఆర్ మెగా హీరోలైన అల్లు అర్జున్, చరణ్, సాయి ధరమ్ వంటి వారితో మంచి స్నేహం కలిగి ఉన్నారు.

Sankranthi Special Mega Family

అలాగే మెగా హీరోలు వివిధ సందర్భాలలో ఎన్టీఆర్ ని పొగడడం విశేషం. మెగా డాటర్ నిహారిక టాలీవుడ్ లో ఏ హీరో ప్రక్కన నటించాలని ఉందని అడుగగా, ఆమె ఎన్టీఆర్ పేరు చెప్పారు. ఇక ధరమ్ తేజ్ బెస్ట్ డాన్సర్ బిరుదు ఎన్టీఆర్ కి ఇవ్వడం విశేషం. తాజాగా అల వైకుంఠపురంలో సినిమాను పొగుడుతూ ఎన్టీఆర్ ట్వీట్ వేయగా బన్నీ సూపర్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ విధంగా మెగా హీరోలలో ఎన్టీఆర్ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. రామ్ చరణ్,ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విరామంలో ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ షెడ్యూల్ జనవరి 20న మొదలుకానుందని సమాచారం. రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.