Jr NTR: తారక్ కు పాజిటివ్.. సర్ ప్రైజ్ లు లేనట్టే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తనకు కరోనా వైరస్ సోకినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఎన్టీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నా ఎన్టీఆర్ కు కరోనా సోకడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. ఎన్టీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కు విజిటర్స్ ద్వారా కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది.

నిన్న కరోనా లక్షణాలు కనిపించడంతో ఎన్టీఆర్ పరీక్షలు చేయించుకున్నారని తాజాగా పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ లో పాజిటివ్ రావడంతో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని వారికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కు కరోనా సోకడంతో ఆ ప్రభావం ఆర్ఆర్ఆర్ సినిమాపై కొంతవరకు పడనుందని తెలుస్తోంది.

కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే షూటింగ్ మొదలుపెట్టకపోయినా డబ్బింగ్, సినిమాకు సంబంధించి ఇతర పనులను పూర్తి చేయించాలని రాజమౌళి భావించారు. కరోనా నెగిటివ్ వచ్చినా కరోనా బాధితులకు నీరసం ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కనీసం నెలరోజులు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలు కరోనా బారిన పడుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన సర్ ప్రైజ్ లు లేనట్టేనని తెలుస్తోంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.