రియల్ టైగర్ తో ఫైట్ చేయనున్న యంగ్ టైగర్

కొన్ని సినిమాల కోసం కొన్ని రిస్కులు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. సినిమా రేంజ్ ని బట్టి సదరు చిత్ర కథానాయకుడు చేయాల్సిన, చేసే రిస్క్ మీటర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ కోవలోకి వచ్చి చేరాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ ఏవైటెడ్ పీరియాడిక్ ఫిలిమ్ “ఆర్ ఆర్ ఆర్”లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికీ ఎన్టీఆర్ మీద కొన్ని భీభత్సమైన ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేశాడు రాజమౌళి. అయితే.. ఎన్ని యాక్షన్ బ్లాక్స్ పెట్టినా ఏదో ఒక స్పెషల్ ఫైట్ ఉండాలి అనుకొన్నాడేమో.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా ఒక పులితో తలపడే సీక్వెన్స్ ను డిజైన్ చేశాడట.

is-there-any-update-on-aug15th-from-rrr-movie1

ఎన్టీఆర్ నిజానికి నిజమైన పులితో ఫైట్ చేయడు అనుకోండి. గ్రాఫిక్స్ ప్రపంచంలో ఆరితేరిపోయిన రాజమౌళికి నిజమైన పులికి రీక్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ.. తెరపై ఆ ఫైట్ ను చూస్తున్నవాళ్లకి మాత్రం మైండ్ పోతుందట. ఆ రేంజ్ లో సదరు యాక్షన్ బ్లాక్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇకపోతే.. “యమదొంగ” సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ లో కూడా పులి రిఫరెన్స్ ను రాజమౌళి వాడిన సంగతి అందరికీ తెలిసిందే.

Share.