ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మండిపడ్డ మీరా చోప్రా.. కారణం..?

పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణి డైరెక్షన్లో తెరకెక్కిన ‘బంగారం’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా చోప్రా. అటు తరువాత ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. కానీ ఆ చిత్రాలన్నీ ప్లాప్ అవ్వడంతో ఈమెకు సరైన గుర్తింపు రాలేదు. దాంతో మళ్ళీ తెలుగు సినిమాల వైపు ఈమె తిరిగి చూడలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. మొన్నటికి మొన్న తన తండ్రిని కొంతమంది దుండగులు.. బెదిరించి విలువైన వస్తువులు, వాలెట్ ను లాక్కున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ కు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే.

అది పక్కన పెడితే ఇటీవల ఈమె ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అందులో తనకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని చెప్పింది. మరి ఎన్టీఆర్ సంగతి ఏంటి? అని ఓ ఎన్టీఆర్ అభిమాని అడిగితే.. ‘నాకు ఎన్టీఆర్ కన్నా మహేష్ బాబు అంటేనే ఇష్టమని’ తేల్చి చెప్పేసింది. దీంతో ఈమె పై పగ పెట్టేసుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ తరువాత ఈమె పై ‘పో* స్టార్, ల*జ, రాత్రికి వ*వా’ అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. దీంతో ఆమె ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. “ఎన్టీఆర్ గారు… మీ ఫ్యాన్స్ నన్ను ‘వేశ్య, అశ్లీల నటి’ అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. అసలు మీ వాళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదు.

మీ కంటే మహేష్ బాబునే నేను ఎక్కువ ఇష్టపడతాను అని… చెప్పడం వల్లనే ఇలా చేస్తున్నారు. నా తల్లిదండ్రులకు కూడా అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నారు. ఇలాంటి ఫ్యాన్స్ తో మీరు సక్సెస్ సాధించినట్టు ఫీలవుతున్నారా? మీరు తప్పకుండా నా ట్వీట్ పట్ల స్పందిస్తారని ఆశిస్తున్నాను” అంటూ పేర్కొంది. మహేష్ బాబుని కూడా ఈమె ట్యాగ్ చేసింది. మీరా చోప్రా ట్వీట్ పై గాయని చిన్మయి స్పందిస్తూ.. ‘వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని’ సలహా ఇచ్చింది. ఈ రిప్లై చూసిన మీరా చోప్రా.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Share.