తారక్ ఫ్యాన్స్ కు శుభవార్త.. 6 నెలల్లో 2 సినిమాలు

స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా విడుదలై రెండున్నర సంవత్సరాలైంది. 2010 సంవత్సరం నుంచి ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ కావడం వల్ల గత రెండేళ్లలో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్న ఎన్టీఆర్ కేవలం ఆరు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13వ తేదీన విడుదల కానుండగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ 2022 ఏప్రిల్ నెలలో తేదీన విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే కథ సిద్ధం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినీమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ హీరోగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ మే నెల 20వ తేదీ నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

పొలిటికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని అయిననూ పోయిరావలె హస్తినకు, చౌడప్ప నాయుడు అనే టైటిల్స్ ను ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ వల్ల గ్యాప్ రావడంతో ఇకపై సినిమాసినిమాకు గ్యాప్ రాకుండా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేస్తినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.