పవన్ వదిలేశాడు.. జాన్ అబ్రహాం పట్టుకొన్నాడు

తమిళంలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన వేదాలం రీమేక్‌ లో నటించేందుకు బాలీవుడ్ న‌టుడు జాన్ అబ్ర‌హం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు స‌మాచారం. తమిళ సూపర్‌స్టార్ అజిత్ నటించిన వేదాలం యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రం గా నిలిచింది. తొలుత ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా చేద్దామనుకొన్నారు నిర్మాత ఏ.ఎం.రత్నం. అందుకోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. సినిమాలకు దూరమైపోవడంతో తెలుగు రీమేక్ మరుగున పడిపోయింది.

అయితే.. వేదాలమ్ స్టోరీ లైన్ జాన్‌కి ఎంత‌గానో న‌చ్చ‌డంతో ఆయ‌న ఈ రీమేక్‌లో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ట‌.ఈ చిత్రంలో జాన్ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. భూష‌ణ్ కుమార్ వేదాలం హిందీ రైట్స్ ఇప్ప‌టికే ద‌క్కించుకుంది. మరి ఈ చిత్రాన్ని ఎవ‌రు తెర‌కెక్కించ‌నున్నారు. న‌టీన‌టులు ఎవ‌ర‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Share.