ఆకట్టుకున్న జోడి ట్రైలర్ | ఆది, శ్రర్ద శ్రీనాథ్

ఫ్యా మిలీ ఎంటర్ టైనర్స్ కి ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించబోతున్న చిత్రం ‘జోడి’. ఈ రోజు విడుదలైన ట్రైలర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని హైలెట్ చేసింది. ఆది, శ్రర్ద ల మద్య అందమైన ప్రేమకథతో పాటు సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ రోల్ చాలా ఆసక్తిగా కనిపించింది. అవుట్ అండ్ అవుట్ ప్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన జోడి సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అవుతుంది. అవుట్ డోర్ ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా ఉన్న జోడి కి ప్రీ రిలీజ్ బజ్ కూడా చాలా బాగా వచ్చింది.

jodi-theatrical-trailer-talk1

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న హీరో ఆది, యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రర్ద ప్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే అందమైన ప్రేమకథగా తెరకెక్కిన జోడి అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది. సినిమా బిజినెస్ కి కూడా మంచి ఆఫర్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. హీరో ఆది, హీరోయిన్ శ్రర్ద శ్రీనాథ్ లుక్స్ కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. రోమాంటిక్ కామెడీ జానర్ లో తెరెకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో శ్రర్దా శ్రీనాథ్ క్యారెక్టర్ యూత్ కి బాగా రిలేట్ అయ్యే విధంగా మలచబడింది. ఏ పాత్ర కయినా వందశాతం న్యాయం చేసే హీరో ఆది ఈ మూవీ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రతో మెప్పించబోతున్నాడు.

Share.