అప్పుడు తల్లి శ్రీదేవి.. ఇప్పుడు కూతురు జాన్వీ కపూర్

దివంగత శ్రీదేవి “బాహుబలి” చిత్రంలో రాజమాత శివగామి పాత్రను రిజెక్ట్ చేసిందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలను రాజమౌళి కూడా ఖండించకపోవడంతో ఒకానొక ఇంటర్వ్యూలో శ్రీదేవిని ప్రశ్నించగా.. ఆ సందర్భంలో రాజమౌళి మీద కూడా కాస్త గట్టిగానే ఫైర్ అయ్యింది శ్రీదేవి. కొన్నాళ్ళ తర్వాత ఆ వార్తను జనాలు మర్చిపోయారు.. ఇంకొన్నాళ్ల తర్వాత శ్రీదేవి మరణంతో ఆ విషయంలో కొందరు బాధపడ్డారు. మరి ఆమె తల్లి మీద ఎలిగేషన్స్ చేశాడని బాధపడిందో లేక.. తన తల్లి చనిపోయేముందు నెగిటివ్ అవ్వడానికి కారకుడయ్యాడని కోపమో తెలియదు కానీ.. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దర్శకధీరుడు రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసింది.

“ఆర్ ఆర్ ఆర్”లో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటించనుండగా.. ఎన్టీఆర్ సరసన నటించాల్సిన ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడంతో అప్పట్నుంచి ఎన్టీఆర్ సరసన నటించాల్సిన అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాడు రాజమౌళి. బ్రిటిష్ యువతి పాత్ర కావడంతో జాన్వీ కపూర్ సరిపోతుందని భావించి రాజమౌళి ఆమెను అప్రోచ్ అవ్వగా.. ఆమె ససేమిరా అన్నదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. “ఆర్ ఆర్ ఆర్”లో అవకాశం వదులుకోవడం మాత్రం మంచి డెసిషన్ కాదు.

Share.