‘జాతి రత్నాలు’ ట్రైలర్: నాన్ స్టాప్ నవ్వులు.. గ్యారెంటీ..!

నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి స్టార్ కమెడియన్లు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాత కావడం విశేషం. రధన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించి ‘చిట్టి నా బుల్ బుల్’ అనే పాటను ఈ మధ్యనే విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది.

ఇక మార్చి 11న ఈ చిత్రం విడుదల కాబోతుండడంతో ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.. అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగానే ఉంది.నవీన్ పోలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’ చిత్రానికి మించి ‘జాతి రత్నాలు’ సినిమాలో చాలా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.

అతనికి ప్రియాదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి కమెడియన్లు కూడా తోడవ్వడంతో.. ఈ సినిమా విడుదల రోజున థియేటర్లలో ప్రేక్షకులు పడి పడి నవ్వడం గ్యారెంటీగా కనిపిస్తుంది. ట్రైలర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. చివరిగా బ్రహ్మానందం కూడా ఎంట్రీ ఇచ్చి తన మార్క్ ఎక్స్ప్రెషన్లతో సందడి చేసాడు. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.