‘జాతిరత్నాలు’ టీజర్: వీళ్లే ‘జాతిరత్నాలు’!

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమా బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. ఈ సినిమాకు అనుధీప్‌ కేవీ దర్శకత్వం వహిస్తుండగా.. ఫరీదా హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

”మామా… వీళ్ళే మా జాతిరత్నాలు” అంటూ టీజర్ ని వదిలారు. టీజర్ మొత్తం కూడా కామెడీతో నింపేశారు. ముగ్గురు స్నేహితుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించారని టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిల కామెడీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ తోనే నవ్వులు కురిపించారంటే.. సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు రథన్ సంగీతమందిస్తున్నాడు.


ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.