ఈ రేటింగ్స్, సెలబ్రిటీస్ రివ్యుస్ తో సంచలనాలు సృష్టించడం ఖాయం

నిన్నటినుంచి ఆడుతున్న ప్రతి థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తున్న “జాతిరత్నాలు” ఆల్రెడీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో హంగామా చేస్తోంది. మొదటి రోజు 4.2 కోట్ల కలెక్షన్ సాధించి చిన్నపాటి సంచలనం సృష్టించింది. లాంగ్ వీకెండ్ కూడా కలిసి రావడంతో ఓపెనింగ్ వీకెండ్ లోనే ఇరవై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూస్తుంటే సినిమా ఉప్పెన స్థాయిలో వంద కోట్ల మార్క్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ, క్రిటిక్స్ రేటింగ్స్ అన్నీ సినిమాకి భీభత్సమైన పాజిటివ్ గా నిలుస్తున్నాయి.

ఇవి సరిపోవన్నట్లు సెలబ్రిటీలు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి బడా యాక్టర్ సినిమా విడుదలైన తదుపరి రోజు సినిమా గురించి పాజిటివ్ ట్వీట్ పెట్టడం వల్ల వచ్చే పాజిటివ్ అవుట్ కమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా మిగతా సెలబ్రిటీలు కూడా సినిమా గురించి పోస్ట్ పెట్టడం మొదలెట్టారు. అసలే మంచి కామెడీ సినిమా థియేటర్లలో విడుదలై చాలా కాలమైంది. తెలుగు ప్రేక్షకులు ఆఖరిసారి థియేటర్లలో మనస్పూర్తిగా పడిపడి నవ్వుకుని ఎన్ని రోజులైందో.

అందుకే “జాతిరత్నాలు” పీపుల్స్ బ్లాక్ బస్టర్. అనుదీప్ టేకింగ్, నవీన్ పెర్ఫార్మెన్స్, రాహుల్-దర్శిల టెర్రిఫిక్ కాంబినేషన్, రధాన్ మ్యూజిక్ సినిమాకి హైలైట్స్. ఇక చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి నటులు కూడా జాతిరత్నాలపై ప్రశంసల వర్షం కురిపించడం మొదలెడితే “జాతిరత్నాలు” బాక్సాఫీస్ దండయాత్రకు అడ్డు ఉండదు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.