‘జబర్దస్త్’ వినోద్ పై హత్యాయత్నం.. కారణం అదే?

‘జబర్దస్త్’ కామెడీ షో లో లేడీ గెటప్ వేసుకుని సందడి చేసే వినోద్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చూడటానికి నిజంగానే అమ్మాయా.. అని డౌట్ వచ్చేలా… లేడీ గెటప్ లో ఒదిగిపోతుంటాడు వినోద్. అయితే కొద్దిసేపటి క్రితమే అతని పై హత్యాయత్నం జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో…. గాయాలతోనే వినోద్ కాచిగూడ పోలీస్ ల దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ‘తన ఇంటి ఓనరే దాడికి పాల్పడ్డాడని’ ఆ కంప్లైంట్లో పేర్కొన్నాడు. అసలు వినోద్ పై హత్యాయత్నం చేసేలా ఆ ఓనర్ ఎందుకు ప్రయత్నించాడనేది అందరిలోనూ సందేహం కలిగిస్తుంది.

Jabardasth Comedian Vinod Seriously Injured - Filmy Focus

గత కొంత కాలంగా ఇంటిని కాళీ చేసే విషయంలో వినోద్ కు ఓనర్ తో గొడవ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ‘తన ఇంటికి ఖాళీ చేయాలని ఇప్పటికే చాలా సార్లు ఇంటి ఓనర్ .. వినోద్ కు చెప్పినప్పటికీ తను పట్టించుకోలేదట. నేను కోర్టుకైనా వెళతాను కానీ ఇంటిని మాత్రం ఖాళీ చేయను అని వినోద్ చెప్పాడట. దీంతో మాట మాట పెరిగి పెద్ద గొడవ చోటుచేసుకుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇంటి ఓనర్ కోపంతో ఇనుప రాడ్ తీసుకుని వినోద్ పై దాడి చేసాడట. అలా వినోద్ కు తల, కంటి భాగాలలో గాయాలయ్యాయని తెలుస్తుంది. వెంటనే విచారణ చేప్పట్టిన పోలీసులు.. వినోద్ ఇంటికి వెళ్ళగా.. ‘తన ఇంటి ఓనర్ పరారీలో ఉన్నట్లు’ చుట్టు పక్కన ఉన్నవాళ్ళు చెప్పారని పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం వినోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

2

jabardasth-comedian-vinod-seriously-injured-2

3

jabardasth-comedian-vinod-seriously-injured-3

 

Share.