మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి11న విడుద‌ల‌వుతున్న `జాతిర‌త్నాలు`

న‌వీన్‌ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న కామెడీ కేపర్ చిత్రం `జాతి రత్నాలు`. అనుదీప్ కెవి దర్శకత్వంలో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నప్పటికీ సినిమా విడుదల తేదీ గురించి సినీ ప్రేమికులు ఆరా తీస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న `జాతి ర‌త్నాలు` థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ట్లు తెలుపుతూ ఈ రోజు మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ రిలీజ్ డేట్ గురించి ఆరా తీస్తున్న ఆడియ‌న్స్ తో మీడియా వారు జాయిన్ అయ్యి సినిమా ఎప్పుడని అడుగుతున్నట్లు చిన్న హాస్య భరితమైన వీడియో ద్వారా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ

ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి ప్ర‌మోషన‌‌ల్ కంటెంట్‌గా విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్‌కి, జోగిపేట శ్రీకాంత్‌గా మొదటి జాతి రత్నం న‌వీన్‌ పొలిశెట్టిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.. ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి సింగిల్ చిట్టి లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సిద్దం మనోహర్ ఛాయాగ్రాహణం అందిస్తుండగా.. అభినవ్ రెడ్డి దండా ఎడిటింగ్ చేస్తున్నారు. న‌వీన్‌ పొలిశెట్టి, ప్రియ‌దర్శి, రాహుల్ రామ‌కృష్ణ, ఫరియా అబ్దుల్లా, ముర‌ళిశ‌ర్మ‌, న‌రేష్ వి.కె, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.