’96’ ను మ్యాచ్ చేయలేదు.. క్యాచ్ చేయలేదు..!

2018లో తమిళంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన… విజయ్ సేతుపతి, త్రిష ల ’96’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన.. సి.ప్రేమ్ కుమారే.. తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సమంత లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘జాను’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండీ టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

Jaanu Movie Teaser Review1

చిన్నప్పటి క్రష్ ను చాలా ఏళ్ళ తరువాత ఓ ‘గెట్ టు గెథెర్’ లో కలుసుకున్న హీరో కి ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు టీజర్ స్పష్టం చేస్తుంది. ఒరిజినల్ చూసిన వాళ్ళకి.. ఆ రేంజ్లో శర్వానంద్, సమంత లు కనెక్ట్ కాకపోవచ్చు. కానీ వాళ్ళ లుక్స్ బాగున్నాయి. ’96’ కు సంగీతం అందించిన గోవింద వసంత.. ఈ రీమేక్ కు సంగీతం అందించాడు. టీజర్లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తంగా టీజర్ ఒరిజినల్ ను మ్యాచ్ చేయలేకపోయినా, క్యాచ్ చేయలేకపోయింది కానీ.. శర్వానంద్, సమంత ల వల్ల ఆకర్షించే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.