మరో యాంకర్‌ సినిమా రిలీజ్‌అవుతోంది

‘నీలి నీలి ఆకాశం… ’ అంటూ అభిమానుల దగ్గరకొచ్చి మెప్పుపొందాడు ప్రదీప్‌ మాచిరాజు. యాంకర్‌గా బుల్లితెరపై ఎంత పేరు తెచ్చుకున్నా… హీరోగా క్లిక్‌ అవుతాడా అని చాలామంది ప్రశ్నలు వేశారు. అయితే పాట ప్రభావమో, సినిమా ప్రభావమో కానీ ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ ఫర్వాలేదనిపించింది. ఓ మోస్తరు వసూళ్లతో ప్రదీప్‌ మాచిరాజును హీరోని చేసేసింది. ఇప్పుడు అదే దారిలో మరో యాంకర్‌ అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. అతనే రవి. బుల్లితెరపై ఎనర్జటిక్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రవి ప్రధాన పాత్రలో నటించిన ఓ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవి నటించిన చిత్రం ‘తోటబావి’ సినిమాను మార్చి ఐదున విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. గౌతమి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను అంజి దేవేండ్ల తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు చూస్తుంటే… చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలి. ప్రదీప్‌ స్టైల్‌లో రవి కూడా ప్రచారం బాగా చేసుకుంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. బుల్లితెర పై ఓ వెలుగు వెలిగినా.. దానిని వెండితెర మీద కొనసాగించడం అంత సులభమేమీ కాదు.

ఆ ఇమేజ్‌ ఇక్కడ అంతగా ఉపయోగపడదని అంటుంటారు. మరి ప్రదీప్‌ అయితే దానిని అధిగమించాడు. రవి ఏం చేస్తాడో చూడాలి. నిజానికి రవికి గతంలోనే ఓ సినిమా చేసిన అనుభవం ఉంది. ‘ఇది మా ప్రేమ కథ’ పేరుతో ఆ సినిమా విడుదలైంది. అయితే అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ‘తోటబావి’తో అయినా హిట్‌ ట్రాక్‌ ఎక్కుతాడేమో చూడాలి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.