పూరి… భోజ్ పూరి విలన్..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జులై 18 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పై క్రేజ్ ఏర్పడింది. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.

ismart-shankar-movie-trailer-review1

‘హే బొమ్మ.. నువ్వు ఊ అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా.. నిన్ను భేగం ని చేసి కూర్చోబెడతా’ అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. చాక్లెట్ బాయ్ లా ఉండే రామ్ ఈ చిత్రంలో భోజ్ పూరి విలన్ లా తయారయ్యాడు. పక్కా మాస్ గా కనిపిస్తున్నాడు. 6 ప్యాక్ చేసి తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు పేల్చేస్తున్నాడు.

ismart-shankar-movie-trailer-review2

పూరి చిత్రంలో ఉండే యాక్షన్, రొమాన్స్ కు డోకా లేదు. మధ్యలో వచ్చే ‘సగం మెంటల్.. సగం భోజ్ పూరి విలన్’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ మొత్తంలో మణిశర్మ మ్యూజిక్ ను హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఇక మెదడు లో ‘సిమ్ కార్డు’ పెట్టడం అనే కాన్సెప్ట్ ఏంటనేది సినిమాలోనే చూడాలి. ఓవర్ ఆల్ గా ట్రైలర్ ఓకే అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Share.